రాజమౌళి రెమ్యునరేషన్ లెక్క తేలింది..!

బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి రెమ్యునరేషన్ ఎంత ఉంటుందని ఆలోచిస్తే సినిమా రేంజ్ ను బట్టి కచ్చితంగా ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. తన రెమ్యునరేషన్ విషయాల గురించి చెప్పుకొచ్చిన రాజమౌళి సినిమా ఫిక్స్ చేసుకున్నాక తన రెమ్యునరేషన్ కింద ప్రాఫిట్ లో షేర్ కూడా అడుగుతానని అన్నాడు జక్కన్న అయితే అది ఎంత పర్సెంటేజ్ అన్నది మాత్రం చెప్పలేదు.

బహుబలికి చాలా తక్కువ రెమ్యునరేషనే తీసుకున్నా అంటున్న రాజమౌళి సినిమా హిట్ అయితే మాత్రం పర్సెంటేజీ తీసుకుంటానని కుంద బద్ధలు కొట్టినట్టు చెప్పాడు. ఇక నిర్మాతతో కేవలం డబ్బుతోనే సినిమా తీయాలనుకుంటే తనకు నచ్చదని.. అతనిలో సినిమా మీద ఓ ప్యాషన్ కనబడాలని అన్నారు రాజమౌళి. సో మొత్తానికి రాజమౌళి హిట్ సినిమాలో పర్సెంటేజీ తీసుకుంటానని ఆయనే చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.