
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి డైరక్షన్ లో వస్తున్న సినిమా జై లవకుశ. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలను పెంచేసిన తారక్ సినిమాతో మళ్లీ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ ను సంతోషపెట్టిన తారక్ ఇప్పుడు టీజర్ తో వారికి మరో గిఫ్ట్ అందించబోతున్నాడట. జూన్ 21న రంజాన్ కానుకగా జై లవకుశ టీజర్ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.
ఎన్.టి.ఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవకుశ సినిమాను ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తుండటం విశేషం. రాశి ఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దసరా బరిలో దిగేందుకు రెడీ అవుతున్న జై లవకుశ పోటీలో టాప్ ప్లేస్ లో నిలబడే సత్తా చూపాలని ఆశిస్తున్నారు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్.