
అందాల రాక్షసిగా తెలుగు తెర మీద అందం అభినయంతో ఆకట్టుకుంటున్న లావణ్య త్రిపాఠి ప్రస్తుతం టాలీవుడ్ నుండి కోలీవుడ్ వైపు కూడా వెళ్లాలని చూస్తుంది. ఇక్కడ వరుస సినిమాలను చేస్తున్నా స్టార్ ఇమేజ్ మాత్రం సంపాదించలేదు అమ్మడు. అందుకే ఓ రీమేక్ తో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది.
తెలుగులో సూపర్ హిట్ అయిన 100% లవ్ సినిమా తమిళ రీమేక్ లో జివి ప్రకాశ్ పక్కన ఛాన్స్ దక్కించుకుంది లావణ్య త్రిపాఠి. తెలుగులో దట్ ఈజ్ మహాలక్ష్మి అంటూ ఆ సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న తమన్నా నటించగా కోలీవుడ్ లో కూడా ముందు ఆమెనే హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నాలు చేశారట. కారణాలు తెలియకున్నా తమిళ 100 % లవ్ కు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. అలా తమన్నా దగ్గర నుండి ఆ ఛాన్స్ లావణ్యకు దక్కింది. మరి కోలీవుడ్ లో అమ్మడి ఫేట్ ఎలా ఉండబోతుందో చూడాలి.