బన్ని స్టామినా అంటే ఇది..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దువ్వాడ జగన్నాధం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో శరణం భజే సాంగ్ హిట్ అవగా రీసెంట్ గా గుడిలో బడిలో 1 మినిట్ వీడియో రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే 5 మిలియన్ వ్యూయర్స్ తో మరోసారి స్టైలిష్ స్టార్ సత్తా చాటుతుంది ఈ సాంగ్.

దేవి మ్యూజిక్.. బన్ని పూజా అదిరిపోయే స్టెప్స్ అన్ని సాంగ్ ను పీక్ స్టేజ్ లో నిలబెట్టాయి. ప్రస్తుతం 5.5 మిలియన్ వ్యూయర్స్ తో అల్లు అర్జున్ డిజె పై అంచనాలు పెంచేశాయి. జూన్ 23న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో మరోసారి ఖాతాలో బ్లాక్ బస్టర్ వేసుకోవాలని చూస్తున్నడు బన్ని. మొదటిసార్ బ్రాహ్మణ పాత్రలో నటిస్తున్న బన్ని సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు కనిపిస్తుంది.