
ఈరోజుల్లో, బస్టాప్ అంటూ యూత్ ఎట్రాక్టెడ్ అడల్ట్ డోస్ తో సినిమాలను తీసిన దర్శకుడు మారుతి భలే భలే మగాడివోయ్, బాబు బంగారం సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో ముందడుగేస్తున్న మారుతి ప్రస్తుతం 'ఆకలి రాజ్యంలో అంతులేని కథ' సినిమా నిర్మిస్తున్నాడు.
రోజులు మారాయి ఫేం మురళి డైరక్షన్ లో ఈ సినిమా రాబోతుంది. నిర్మాతగా ఉన్నా మారుతి తన సినిమా మీద తన ఇంప్రెషన్ ఉండేలా జాగ్రత్తపడతాడు. కమల్ హాసన్ నటించిన ఆకలి రాజ్యం, రజినికాంత్ నటించిన అంతులేని కథ ఈ రెండు టైటిల్స్ తో వస్తున్న ఆ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఆకలి రాజ్యం సినిమా ఇప్పటి యువతరానికి నప్పేలా తీయాలని చాలామంది దర్శకులు ట్రై చేశారు మరి మారుతి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో మరి.