2.0 రెండు క్లైమాక్సులు..!

సూపర్ స్టార్ రజినికాంత్ శంకర్ కాంబినేషన్ లో రోబో సీక్వల్ గా వస్తున్న సినిమా 2.0. లైకా ప్రొడక్షన అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా కేవలం క్లైమాక్స్ ఒక్కటే పెండింగ్ ఉన్నదట. అయితే శంకర్ కు రెండు రకాల క్లైమాక్స్ సజెషన్స్ వచ్చాయని తెలుస్తుంది.

400 కోట్ల బడ్జెట్ కాబట్టి మొత్తం గ్రాఫిక్స్ తో ఫైట్ ప్లాన్ చేయాలని రజిని సలహా ఇవ్వగా.. లీడ్ పాత్రలతో రియలిస్టిక్ ఫైట్ అయితే బాగుంటుందని అక్షయ్ కుమార్ అంటున్నాడట. ఈ ఇద్దరు ఇచ్చిన సూచనలలో శంకర్ ఏది ఫైనల్ చేస్తాడో ఏమో కాని ప్రస్తుతం 2.0 క్లైమాక్స్ కు చెందిన ఈ న్యూస్ సినిమా మీద అంచనాలను పెంచేస్తుంది. బాహుబలి రికార్డులను బీట్ చేసే రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.