చైతు ఛాన్స్ అతనికి దక్కింది..!

అక్కినేని హీరో నాగ చైతన్య ఈమధ్యనే రారండోయ్ వేడుక చూద్దాం సక్సెస్ జోష్ లో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత గౌతం మీనన్ నిర్మాణంలో ధ్రువంగల్ పదినారు సినిమా డైరక్టర్ కార్తిక్ నరేష్ డైరక్షన్ లో ఓ సినిమా చేయాలని చూశాడు చైతన్య. తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ చేసే ఈ ప్రాజెక్ట్ తో తమిళంలో కూడా మార్కెట్ పెంచుకోవాలని చూశాడు.

ఏమైందో ఏమో కాని ఈ సినిమా రేసు నుండి చైతు పక్కకి తప్పుకున్నట్టు తెలుస్తుంది. చైతు బదులు సందీప్ కిషన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట. ప్రాజెక్ట్ జెడ్ పేరుతో రాబోతున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారట. ఈమధ్య తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలను చేస్తూ అక్కడి వారికి దగ్గరైన సందీప్ కిషన్ ఈ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ చేజిక్కించుకోవడం లక్కీ అని అంటున్నారు.