
స్టార్ హీరో సినిమా పండుగ సీజన్ లో రిలీజ్ అవడం కామనే.. ఫెస్టివల్ టార్గెట్ తో స్టార్స్ తమ సినిమాలను వదులుతారు. ఆ క్రమంలో ఈ దసరా బరిలో ముందు ఖర్చీఫ్ వేసేశాడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. బాబి డైరక్షన్ లో జై లవకుశ సినిమా చేస్తున్న తారక్ ఆ సినిమా దసరాకు రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ కూడా దసరా రిలీజ్ అని టీజర్ తో ఎనౌన్స్ చేశారు.
ఇక సుకుమార్ రాం చరణ్ మూవీని కూడా దసరా కల్లా పూర్తి చేసి రిలీజ్ చేయాలని అనుకున్నారు. పవన్ త్రివిక్రం కాంబినేషన్ లో మూవీ దసరా బరిలో అన్నారు. కాని ఇప్పటిదాకా ఏది అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. మహేష్ మాత్రం దసరా రిలీజ్ అని ఫిక్స్ చేశాడు కాబట్టి మిగతా వారు రిలీజ్ డేట్లు మార్చుకునే అవకాశం ఉంది. చూస్తుంటే మరోసారి డిసెంబర్ లో రాం చరణ్, జనవరిలో పవన్ వచ్చేలా పరిస్థితులు కనబడుతున్నాయి.