రాజ్ తరుణ్ బోర్ కొట్టేశాడు..!

టాలీవుడ్ క్రేజీ జంటలలో రాజ్ తరుణ్ హెబ్భా పటేల్ జోడి ఒకటి. కుమారి 21f సినిమాతో కలిసి నటించిన ఈ ఇద్దరు ఆ సినిమా హిట్ తో హాట్ పెయిర్ గా అవతారమెత్తారు. అంతేకాదు ఇద్దరి మధ్య లిప్ లాకుల కెమిస్ట్రీ బాగా కుదిరేయడంతో మళ్లీ మళ్లీ ఇద్దరిని పెట్టి సినిమాలు చేస్తున్నారు కుమారి తర్వాత ఆడోరకం ఈడోరకం సినిమాలో కూడా జతకట్టిన ఈ ఇద్దరు ఇప్పుడు అంధగాడుతో రాబోతున్నారు.

మూడు సినిమాల్లో రాజ్ తరుణ్ తో జోడిగా నటించిన హెబ్భా తనకు ఆ హీరో బోర్ కొట్టేశాడని అంటుంది. అంతేకాదు ఇప్పుడప్పుడే ఇక రాజ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా తాను చేసేది లేదని తెగేసి చెబుతుంది. వరుసగా మూడు సినిమాలు చేసే సరికి తనకు రాజ్ కు మధ్య ఏదో నడుస్తుందని అంటున్నారని అందుకే రాజ్ తరుణ్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నా అంటుంది హెబ్భా పటేల్. హిట్ పెయిర్ కాబట్టి దర్శక నిర్మాతలు ఫ్యాన్సీ ప్రైజ్ ఆఫర్ చేసే ఆమె మాత్రం చేయకుండా ఉంటుందా చెప్పండి. ఏదో పైకి అలా అంటుంది కాని రాజ్ తరుణ్ తో తన స్క్రీన్ షేరింగ్ అదుర్స్ అని అమ్మడికి బాగా తెలుసు.