అఖిల్ కోసం కాదు నాగార్జున కోసం ఒప్పేసుకుంది

అక్కినేని నాగార్జున టబు ఇద్దరిది క్రేజీ జోడి అని తెలిసిందే. సినిమాల్లోనే కాదు బయట కూడా మంచి స్నేహితులుగా ఉన్నారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ ప్రమోట్ అయిన టబు అక్కడే సినిమాలను చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది. తెలుగులో ఒకటి రెండు అవకాశాలు వచ్చినా సరే వద్దనేస్తుంది. కాని  నాగార్జున అడగడం వల్ల మరోసారి తెలుగు సినిమాలో నటించేస్తుంది టబు. 

అక్కినేని అఖిల్ హీరోగా రెండో సినిమా విక్రం కుమార్ డైరక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ తల్లి పాత్రలో టబు నటిస్తుందట. టబు ఇమేజ్ కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు. 24 తర్వాత విక్రం కుమార్ చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. నాగార్జున రికమెండేషన్ తోనే అఖిల్ సినిమాలో టబు నటిస్తుందని అంటున్నారు. తండ్రితో డ్యూయెట్ పాడిన టబు తనయుడికి తల్లి పాత్రలో నటించేందుకు రెడీ అయ్యింది.