ఎన్.టి.ఆర్ కు పోటీగా రానా..!

బాలీవుడ్ ట్రెండ్ ఫాలో అవుతున్న టాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ హీరోలు స్మాల్ స్క్రీన్ పై కూడా పలు ప్రోగ్రామ్స్ లో మెరుస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ ఇమేజ్ తో స్మాల్ స్క్రీన్ కు వన్నె తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవిలు ఎం.ఈ.కె షోతో అదరగొట్టేయగా ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తెలుగు బిగ్ బాస్ షోకి హోస్ట్ గా ఉంటున్నాడని తెలిసిందే.  

అయితే జూనియర్ కు పోటీగా రానా కూడా స్మాల్ స్క్రీన్ పై ఓ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాం చేయబోతున్నాడట. రియాలిటీ షో టైపులోనే ఉండే ఆ ప్రోగ్రాం ఏంటి అన్నది మాత్రం ఇంకా బయటపడలేదు. బాహుబలితో నేషనల్ వైడ్ గా ట్రెండ్ సృష్టించిన రానా స్మాల్ స్క్రీన్ పై కూడా తన మైలేజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు. మరి తారక్ రానాల స్మాల్ స్క్రీన్ ఫైట్ ఎలా ఉంటుందో చూడాలి.