
సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. స్పైడర్ టైటిల్ కు తగ్గట్టుగానే సైన్స్ ఫిక్షన్ మూవీ అప్పీల్ ఇస్తూ వదిలిన టీజర్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ముఖ్యంగా మహేష్ లుక్ అదిరిపోయింది.
సినిమాలో గ్రాఫిక్స్ కు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టుగా టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది. స్పై ఏజెంట్ గా కనిపించబోతున్న మహేష్ సినిమాతో తమిళంలో మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. టీజర్ గురించి ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు మహేష్ ఓ మెమరబుల్ గిఫ్ట్ అందించాడు. అంతేకాదు సినిమా దసరా రిలీజ్ అని అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. సో ఈ దసరాకి మహేష్ స్పైడర్ తో సందడి షురూ చేయనున్నాడన్నమాట.