దర్శకరత్న దాసరి నారాయణ రావు మోహన్ బాబుల మధ్య ఉన్న సత్సంబందం అందరికి తెలిసిందే. మోహన్ బాబుకి మొదటి అవకాశం ఇచ్చి కలక్షన్స్ కింగ్ అయ్యే వరకు తన వెన్నంటే ఉండి కెరియర్ కు సహకరించిన వ్యక్తి దాసరి. అందుకే దాసరిని తండ్రి సమానుడు అని సంభోదిస్తాడు. అయితే కేవలం మాటవరసకే కాదు దాసరి మరణ వార్త తెలిసిన క్షణం నుండి అంత్యక్రియలు పూర్తయ్యే దాకా అన్ని తానై నడిపించారు మోహన్ బాబు.
కిమ్స్ నుండి వార్త వినగానే అక్కడికి చేరుకుని స్వయంగా దగ్గరుండి ఇంటికి తీసుకొచ్చిన మోహన్ బాబు. అక్కడే ఉంటూ వచ్చిన వారిని ఓదారుస్తూ దాసరి మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. దహన సంస్కారాల్లో కూడా మోహన్ బాబు ఉండటం అందరికి తెలిసిందే. జన్మనిచ్చింది తల్లిదండ్రులే అయినా తన సినిమా ప్రస్థానానికి మూల పురుషుడైన దాసరిపై మోహన్ బాబు చూపించిన ఈ ప్రేమ అందరి మనసులను హత్తుకునేలా చేసింది.