
దర్శకరత్న దాసరి నారాయణ రావు మృతి పట్ల ఎంతోమంది సినిమా వారు దాసరితో తమకున్న అనుబంధం గురించి చెప్పుకున్నారు. తమలో ఉన్న భాధనంతా వెళ్లగక్కుతూ గురువు గారిని పోగొట్టుకున్న ఆవేదనను తెలియపరచారు. ఈ క్రమంలో దాసరి మరణం గురించి సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కూడా ఇన్ స్టాగ్రాంలో మెసేజ్ పెట్టాడు. దాసరి సార్.. డైరక్టర్ అనే కుర్చికి ఒక గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి మీరు.. ఆ చెయిర్ లో మీరు మళ్లీ వచ్చి కూర్చోవాలని ఆశిస్తున్నా అంటూ వర్మ మెసేజ్ పెట్టాడు.
ఎప్పుడు సెటైరికల్ గా మెసేజ్ పెట్టే ఆర్జివి దాసరి గారి గురించి ఈ రేంజ్ లో రెస్పాండ్ అవడం కాస్త ఆశ్చర్యకరంగా ఉంది. వర్మ బయటకు చెప్పకపోయినా తన లాంటి ఎంతోమంది దర్శకులకు ఆది గురువుగా ఎన్నో ప్రయోగాత్మక సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచారు దాసరి. అందుకే ఒక దర్శకుడిగా దాసరికి వర్మ అందించిన నివాళి ఇది. వర్మ పెట్టి ఈ మెసేజ్ చూసి మొదటిసారి సమయానికి తగ్గట్టుగా అందరితో పాటు తాను ఆకట్టుకున్నాడని వర్మ గురించి మాట్లాడుతున్నారు.