దాసరి తీరని కోరికలు అవే..!

తెలుగు సినిమా మార్గనిర్దేశం చూపిన దాసరి నారాయణరావు మరణవార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు సిని ప్రియులు. కేవలం ఒక దర్శక నిర్మాతగానే కాదు ఇండస్ట్రీ కోసం ముఖ్యంగా చిన్న సినిమాల కోసం దాసరి గారు పడే తపన అంతా ఇంతా కాదు. కేవలం ఒక జానర్ లోనే సినిమాలని కాకుండా తన ప్రతిభ చాటుతూ దర్శక నిర్మాతగా ఎవరెస్ట్ అంత ఎత్తుకి ఎదిగారు దాసరి. 

ఇన్నేళ్ల కెరియర్ లో తీరని కోరికలు ఏమన్నా ఉన్నాయా అంటే.. ఉన్నాయనే తెలుస్తుంది. మహాభారతం సినిమాను నాలుగు భాగాలుగా తీయాలని ఎంతో ఆశగా స్క్రిప్ట్ పని కూడా చేసుకున్నారట దాసరి.. కాని ఎందుకో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా బోస్ మూవీ ఎనౌన్స్ కూడా చేశారు. దర్శకుల వేటలో పడి ఆ సినిమా కూడా అటకెక్కించేశారు. ఈ రెండు కోరికలు తీరకుండానే దాసరి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. సిని పరిశ్రమ అంతా ఆయనకు నివాళులు అర్పించడమే కాదు కార్మికులంతా సెలవు ప్రకటించారు.