
దర్శకుడు, నటుడు, రచయిత దాసరి నారాయణ రావు తన సినీ ప్రస్తానంలో సుమారు 150కి పైగా సినిమాలు తీశారు. వాటిలో చాలా సినిమాలు సూపర్ హిట్స్. అవి అయన ప్రతిభకు అద్దం పట్టడమే కాకుండా, ఆయనకు, ఆ సినిమాలలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, చివరకు నిర్మాతలకు కూడా గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. కొన్ని రోజుల క్రితం ఆయన ఒక టీవి న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “మీ సినిమాలలో మీకు నచ్చిన బాగా సినిమా పేరు చెప్పండి..” అనే ప్రశ్నకు దాసరి చెప్పిన సమాధానం అద్భుతంగా ఉంది.
“సాధారణంగా ఒక దర్శకుడికి నాలుగో ఐదో..లేకపోతే పదో సూపర్ హిట్స్ ఉంటాయి. వాటిలో కొన్ని అతనికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టినవి కూడా ఉంటాయి. కనుక ఆ దర్శకుడి పేరును తలుచుకొన్నప్పుడు ఆ సినిమాలు టక్కున గుర్తుకు వస్తాయి. కానీ నా విషయానికి వస్తే ఎవరూ నన్ను కొన్ని సినిమాలతో ముడిపెట్టి చెప్పలేరు. ఎందుకంటే ఒకదానిని మించిన సినిమా మరొకటి..అన్నీ వేటికవి భిన్నమైనవే. తాతమనవడు గురించి చెప్పుకొంటే శివరంజనిని దానిని చెప్పుకొంటే ప్రమాభిషేకం, స్వర్గం నరకం, సర్దార్ పాపారాయుడు, సూరిగాడు, మామగారు, ఒసేయ్ రాములమ్మ, ఒరేయ్ రిక్షా, ఎర్రబస్సు ఇలాగ వరుసగా ఒకదాని వెనుక మరొకటి వస్తూనే ఉంటాయి. కనుక వాటిలో నుంచి ఓ నాలుగు సినిమాలు ఏరి చెప్పడం నా వల్లా కాదు ఎవరి వల్లా కాదని నా అభిప్రాయం,” అని దాసరి చెప్పారు.
ఆయన చెప్పిన సమాధానం ఆయన ఆత్మవిశ్వాసాన్ని, తన సినిమాల పట్ల నమ్మకాన్ని, వాటి గొప్పదనానికి అద్దం పట్టిందని చెప్పవచ్చు. ఇతర దర్శకులతో పోల్చి చూసుకొంటే ఆ విషయం అర్ధం అవుతుంది.