
అలనాటి తార మహానటి సావిత్రి బయోపిక్ తో వస్తున్న సినిమా మహానటి. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తుండగా సమంత జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుందని అంటున్నారు. ఇక ఈమధ్యనే హైదరాబాద్ రామకృష్ణ స్టూడియోస్ లో మహానటి సినిమా స్టార్ట్ అవ్వగా అందులో సమంత లుక్ చూసి అందరు షాక్ అవుతున్నారు.
ట్రెండిషనల్ వేర్ లో పాతతరం హీరోయిన్ లా సమంత లుక్ అదిరిపోయింది. సినిమాలో జర్నలిస్ట్ పాత్ర అంటూ చెబుతూ సమంత మాత్రం సర్ ప్రైజ్ లుక్ తో షాక్ ఇస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిక్ వైరల్ గా వెళ్తుంది. కీర్తి సురేష్ తో పాటుగా దుల్కర్ సల్మాన్ జెమిని గణేషన్ గా నటిస్తుండగా విజయ్ దేవరకొండ కూడా సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు.