
కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న దర్శకరత్న దాసరి నారాయణ రావు కొద్ది గంటల క్రితం తుది శ్వాస విడిచారు. సిని పరిశ్రమలో ఎంతోమంది ఆర్టిస్టులను, టెక్నిషియన్స్ ను పరిచయం చేసిన ఘనత దాసరి గారి సొంతం.. ఎన్నో ప్రయోగాలు ఎన్నో మెమరబుల్ మూవీస్ చేసిన దాసరి తెలుగు తెర మీద ఎన్నో అద్భుత కళాకండాలను తెరకెక్కించిన దర్శకుడిగా కీర్తి ప్రతిష్టలను సంపాదించారు. తెలుగు సినిమా పెద్ద దిక్కుగా చూసుకునే దాసరి ఎంతోమందికి అవకాశాన్ని ఇచ్చారు.
రెండు మూడు నెలల క్రితం హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్న దాసరి గారు గ్యాస్టిక్ బెలూన్ సర్జరీ చేయించుకున్నారని తెలుస్తుంది. దర్శక నిర్మాతగానే కాదు నటుడిగా రాజకీయ వేత్తగా కూడా చేశారు దాసరి. దర్శకులలో రత్నం లాంటివాడు కాబట్టే ఆయన్ను దర్శకరత్నం అన్నారేమో.. ఇప్పటికి సిని విశ్లేషణలో దాసరి గారి మార్క్ కనిపిస్తుంది. తెలుగు సినిమా పెద్ద మనిషిగా చూసుకునే దాసరి మరణంతో తెలుగు సినిమా పరిశ్రమ శోక సముద్రంలో మునిగింది.