
టాలీవుడ్ స్టార్ హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై రోజుకో వార్త పుట్టుకొస్తున్నాయి. రీసెంట్ గా కృష్ణం రాజు సెప్టెంబర్ నవంబర్ మధ్యలో మంచి ముహుర్తాలను చూడమని చెప్పాడని వార్తలు రాగా ఇక ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనే అంటూ మరోసారి హడావిడి మొదలైంది.
తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రభాస్ రాశి సిమెంట్ ఓనర్ భూపతి రాజు మనవరాలితో పెళ్లి అంటూ ప్రచారం మొదలైంది. ఓ ఇంగ్లిష్ పేపర్ రివీల్ చేసిన ఈ న్యూస్ నిజమే అంటూ వార్తలు వస్తున్నాయి. బాహుబలితో నేషనల్ లెవల్లో సూపర్ స్టార్డం తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం జాలీ ట్రిప్ లో ఉన్నాడు. ఇక అది పూర్తి చేసుకుని రాగానే సుజిత్ డైరక్షన్ లో చేయబోయే సాహో షూట్ లో పాల్గొంటాడట. ఏది ఏమైనా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ప్రభాస్ ఓ ఇంటివాడు అవ్వడం ఖాయమని తేల్చేస్తున్నారు.