
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా నిన్ను కోరి. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. నివేదా థామస్ హీరోయిన్ గా నటించగా ఆది పినిశెట్టి సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. అసలైతే జూన్ 23న రిలీజ్ ఎనౌన్స్ చేసిన నాని నిన్ను కోరి ఇప్పుడు జూన్ 7న వచ్చేందుకు సిద్ధమయ్యింది.
జూన్ 23న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం రిలీజ్ ఫిక్స్ చేశారు. దిల్ రాజు సినిమా కాబట్టి నానిని రిక్వెస్ట్ చేసి తన సినిమాను ప్రీ పోన్ చేసుకోమని చెప్పినట్టు ఉన్నారు. ఇక వరుస సినిమాల సక్సెస్ లతో దూసుకెళ్తున్న నాని తన సినిమా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో జూన్ 23న అనుకున్న రిలీజ్ ను కాస్త జూన్ 7కి ప్రీ పోన్ చేశారు. ఈ ఇయర్ ఇప్పటికే నేను లోకల్ తో సూపర్ హిట్ అందుకున్న నాని నిన్ను కోరితో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.