సిగరేట్ కన్నా సెక్స్ చేస్తే బెటర్..!

టైటిల్ చూసి కాస్త షాక్ అవడం కామన్.. కాని సిగరేట్ తాగడం, మద్యం సేవించడం కన్నా సెక్స్ చేయడం మంచిందంటూ చెప్పింది హాలీవుడ్ ప్రమోషన్స్ కొట్టేసిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా. లాస్ట్ ఇయర్ క్వాంటికో సీరీస్ లతో హాలీవుడ్ టివి సీరియల్స్ లోకి అడుగుపెట్టిన అమ్మడు హాలీవుడ్ లో బేవాచ్ సినిమాలో నటించింది. బికిని బ్యూటీగా హాలీవుడ్ ప్రేక్షకులకు పిచ్చెక్కించేలా చేసిన ప్రియాంకా ఆ సినిమా హిట్ ఫ్లాప్ కన్నా అక్కడ వారికి బాగా వెల్ నోటెడ్ అయ్యింది.

ఇక ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే హాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన పిసి అక్కడ వారు అడిగిన అన్ని ప్రశ్నలకు తన మార్క్ సమాధానాలతో షాక్ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో ప్రియాంకాని సెక్స్ మీద మీ అభిప్రాయం ఏంటని అడుగగా సిగరేట్, ఆల్కహాల్ డ్రింకింగ్ కన్నా సెక్స్ చేయడం చాలా మంచిందంటూ అవాక్కయ్యేలా సమాధానం ఇచ్చింది. హాలీవుడ్ లోకి వెళ్లాక ప్రియాంకా మరింత స్పీడ్ పెంచిందని తను మాట్లాడే మాటలని బట్టే అర్ధమవుతుంది. అక్కడ స్థిరపడటానికి అమ్మడు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి.