
ఈతరం అభినయ తారగా అభిమానుల మనసులను గెలుచుకున్న నిత్యా మీనన్ కెరియర్ ప్రస్తుతం కాస్త స్పీడ్ తగ్గించిందని చెప్పాలి. కేవలం మళయాల సినిమాలనే చేస్తూ కాలం వెళ్లదీస్తున్న నిత్య మీనన్ లాస్ట్ ఇయర్ ఎన్.టి.ఆర్ జనతా గ్యారేజ్ లో చేసినా లాభం లేకుండా పోయింది. అమ్మడు కెరియర్ కు గ్యాప్ ఇవ్వడానికి దర్శకత్వ భాధ్యతలను చేపట్టాలనే ఆలోచనతోనే అంటూ వార్తలు వస్తున్నాయి.
ఆ వార్త నిత్యా దాకా వెళ్లడంతో అందరు అనుకుంటున్నట్టు తనకు దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉన్నా సరే దానికి ఇంకా టైం ఉందని అంటుంది. ప్రస్తుతం తాను నటిగానే కంటిన్యూ చేస్తానని చెప్పుకొచ్చిన నిత్యా సరైన పాత్ర దొరకకపోబట్టే సినిమాలను చేయట్లేదు అంటుంది. హీరోయిన్ గా అనతి కాలంలోనే సూపర్ క్రేజ్ దక్కించుకున్న నిత్యా మనసుకి నచ్చే పాత్రలు దొరకకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ప్రస్తుతం రెండు సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయట వాటి గురించి త్వరలోనే ఓ ఎనౌన్స్ మెంట్ వస్తుందని చెప్పుకొచ్చింది నిత్యా మీనన్.