
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన ఫ్యాన్స్ కు మరింత చేరువయ్యే క్రమంలో బుల్లితెర మీద కూడా ప్రత్యక్షమవుతున్నాడు. ఇదవరకు కేవలం హిందిలో మాత్రమే వచ్చే బిగ్ బాస్ షోను స్టార్ మా ఇప్పుడు రీజనల్ లాగ్వెజెస్ కు విస్తరిస్తుంది. ఇప్పటికే తమిళ్ లో కమల్ హాసన్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా చేస్తుండగా ఇప్పుడు తెలుగులో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ హోస్ట్ గా చేయనున్నాడట.
తారక్ మొదటిసారి స్మాల్ స్క్రీన్ పై చేస్తున్న షో కావడం విశేషం. జూనియర్ ఈ షో చేసేందుకు భారీ మొత్తం ఆఫర్ చేశారట స్టార్ మా వారు. ఇప్పటికే చిరుతో మీలో ఎవరు కోటీశ్వరుడు నడిపించిన స్టార్ మా తారక్ తో బిగ్ బాస్ షో చేయించాలని చూస్తున్నారు. మరి తన యాక్టింగ్ టాలెంట్ తో సిల్వర్ స్క్రీన్ పై దుమ్ముదులిపే తారక్ స్మాల్ స్క్రీన్ పై ఎలా విజృంభిస్తాడో చూడాలి.