సంఘమిత్రకు శృతి హాసన్ షాక్..!

బాహుబలి తరహాలో కోలీవుడ్ నుండి రాబోతున్న అత్యంత భారీ బడ్జెట్ మూవీ సంఘమిత్ర. సుందర్ సి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 250 కోట్ల దాకా ఉంటుందని అంచనా. సినిమాలో జయం రవి, ఆర్య మేల్ లీడ్స్ చేస్తుండగా ఫీమేల్ లీడ్ లో శృతి హాసన్ ను సెలెక్ట్ చేశారు. సినిమా కోసం గుర్రపు స్వారితో పాటుగా కత్తిసాము లాంటి విద్యలను నేచుకుంది శృతి హాసన్.

ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ తో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అట్టహాసంగా స్టార్ట్ చేసిన ఈ సినిమా నుండి శృతి హాసన్ తప్పుకుందని టాక్. అఫిషియల్ గా ఎనౌన్స్ చేయకపోయినా సంఘమిత్ర నుండి శృతి హాసన్ అవుట్ అని కోలీవుడ్ లో గట్టి టాక్ వినిపిస్తుంది. కేవలం షూటింగ్ స్టార్ట్ చేసి పది రోజులే అవుతుండగా శృతి హాసన్ ఇచ్చిన షాక్ కు దర్శక నిర్మాలు ఏం చేయాలో తోచని పరిస్థితి అయ్యిందట. మరి ఇప్పటికిప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.