ప్రభాస్ పెళ్లి ముహుర్తం ఫిక్స్..!

బాహుబలి సినిమా తర్వాత తన పెళ్లి ఉంటుందని ముందునుండి చెప్పుకొచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పెళ్లిమాట ఎత్తితే ఏమో నాకేం తెలుసు అంటూ మాట దాటేస్తున్నాడు. ప్రభాస్ పెళ్లి కోసం మొన్నటిదాకా టాలీవుడ్ ఒక్కటే వెయిట్ చేసేది కాని ఇప్పుడు ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు కాబట్టి ప్రభాస్స్ పెళ్లి కోసం జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ప్రస్తుతం ఓ హాట్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రభాస్ పెళ్లి ముహుర్తం ఇదే అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. తన పెళ్లి మ్యాటర్ అంతా పెదనాన్న కృష్ణంరాజు చేతిలో పెట్టేసిన ప్రభాస్ తాను మాత్రం జాలీగా ప్రపంచ యాత్రలో ఉన్నాడు. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం కృష్ణం రాజు సెప్టెంబర్ నవంబర్ మధ్యలో ప్రభాస్ నిశ్చితార్ధం చేసే ఆలోచనలో ఉన్నాడట. ఆ సమయాల్లో వచ్చే ముహుర్తాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు 2018 సమ్మర్ లో ప్రభాస్ పెళ్లి ఖాయమని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కాని ప్రభాస్ పెళ్లి మ్యాటర్ తో మరోసారి సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది.