వాళ్ళు బానే ఉన్నారు, నా కొంపే మునిగింది!- కాజల్

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి ఇద్దరు అగ్ర కథానాయకులతో జోడి కడుతోందంటే, ఇక ఈ పాపకి తిరుగులేదు, అని అంతా అనుకున్నారు. అయితే అటు పవన్ కళ్యాణ్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్, ఇటు మహేష్ బాబు సినిమా బ్రహ్మోత్సవం, రెండు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాలు చవిచూడడం తెలిసిందే.

ఎలాగో పెద్ద హీరోలు కాబట్టి, ఆ ఫ్లాపులు వాళ్ళని ఆపలేదు. తదుపరి సినిమా చర్చల్లో అప్పుడే ఇద్దరూ పడిపోయారు. ఎటు తిరిగి కాజల్ కొంపకే  నిప్పంటుకున్నట్టయింది. ఈ ఐరన్ లెగ్ సుందరి మాకోద్దంటే, మాకోద్దంటూ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ హడలిపోతోందట. ఈ పరిస్థితి చూసి ఈ చందమామ పాప, తన స్నేహితులతో- వాళ్ళు (పవన్ కళ్యాణ్, మహేష్ బాబు), బానే ఉన్నారు, నా కొంపే మునిగింది అంటూ తన గోడు వెల్లబోసుకుంటుందట పాపం.     

ప్రస్తుతం కాజల్ చేతిలో ఉన్న సినిమా, "దో లఫ్జోన్ కి కహాని", వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. మొదటిసారి ఈ సినిమాలో పాప, లిప్ లాక్ సీన్ లో నటించిందని ప్రచారం జోరుగా సాగింది కాబట్టి, క్రేజ్ బాగానే ఏర్పడింది. కావున ఈ సినిమా విజయం సాధిస్తే, తన సినిమా కెరీర్ తిరిగి పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.