మొదలైన 'మహానటి' ప్రయాణం..!

బాలీవుడ్ లో కొనసాగుతున్న బయోపిక్ ల హవా తెలులో కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం సావిత్రి బయోపిక్ మహానటి మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. ఎవడే సుబ్రమణ్యం డైరక్టర్ నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కథ కోసం బాగానే రీసెర్చ్ చేశాడట. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా సమంత ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.


అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పెళ్లిచూపులు హీరో విజయ్ దేవరకొండ కూడా ఉంటాడని తెలుస్తుంది. సినిమాలో జెమిని గణేషన్ గా దుల్కర్ సల్మాన్ నటిస్తాడని తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ రామకృష్ణ స్టూడియోలో స్టార్ట్ అయిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.