
మెగా కుటుంబం అదేనండి మెగా బ్రదర్స్ ముగ్గురిని కలిసి ముఖ్యంగా మెగా స్టార్ పవర్ స్టార్ ఇద్దరి కలయికలో ఓ సినిమా తీస్తానని ఎనౌన్స్ చేశారు టి.సుబ్బిరామిరెడ్డి. ఆ సినిమాపై మెగా హీరోలు నోరు విప్పకున్నా సినిమా మాత్రం అనుకున్నట్టుగా తీసి తీరుతా అంటున్నారు సుబ్బిరామిరెడ్డి. ఇప్పటికే త్రివిక్రం ఈ సినిమా కథ సిద్ధం చేశాడట.
పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న త్రివిక్రం ఆ ప్రాజెక్ట్ పూర్తి కాగానే మెగా హీరోల మల్టీస్టారర్ మూవీ చేస్తాడట. ఇప్పటికే స్టార్స్ రెమ్యునరేషన్ అంతా ఫైనల్ చేశారట. కథ కూడా ఒకే చేసుకుంటే ఇక ఎన్నాళ్ల నుండో మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మెగా మల్టీస్టారర్ మూవీ రూపొందినట్టే. ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటేల్స్ త్వరలో వెళ్లడిస్తారట.