మహేష్-ఎన్.టి.ఆర్ బిగ్ ఫైట్..!

సూపర్ స్టార్ మహేష్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్నారు. మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో స్పైడర్ గా వస్తుండగా.. తారక్ బాబి డైరక్షన్ లో జై లవకుశ సినిమా చేస్తున్నాడు. జూన్ లో రిలీజ్ అవ్వాల్సిన స్పైడర్ పోస్ట్ పోన్ అవుతూ చివరకు దసరా టార్గెట్ తో రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఇక సినిమా ఓపెనింగ్ నాడే దసరా రిలీజ్ ప్లాన్ చేసిన తారక్ సినిమా అనుకున్న డేట్ కే దించేస్తాడట.

మహేష్ తారక్ ఇద్దరు సూపర్ స్టార్స్.. ఇద్దరి సినిమాలు హిట్ అయితే ఆ సినిమాల కలక్షన్స్ రేంజ్ ఏంటో తెలిసిందే. బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో ఈసారి గట్టి హిట్ కొట్టాలని మహేష్ స్పైడర్ తో వస్తుండగా.. జనతా గ్యారేజ్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న తారక్ ఆ హిట్ మేనియా కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. మరి ఈ బిగ్ బాక్సాఫీస్ ఫైట్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.