సందీప్ కిషన్ క్రేజీ ప్రాజెక్ట్..!

యువ హీరోల్లో రకరకాల ప్రయత్నలు చేస్తున్నా హిట్ మాత్రం కొట్టలేని సందీప్ కిషన్ వరుసబెట్టి సినిమాలైతే చేస్తున్నాడు కాని ప్రేక్షకులను మాత్రం ఇంప్రెస్ చేయడంలేదు. తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నా సందీప్ కు లక్ కలిసి రావట్లేదు. ప్రస్తుతం కృష్ణవంశీ నక్షత్రం మీదే ఆశలు పెట్టుకున్న సందీప్ కిషన్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ క్రేజీ డైరక్టర్ కునాల్ కొహ్లి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు సందీప్ కిషన్.

హంతుం, ఫనా లాంటి సూపర్ మూవీస్ తో అక్కడి ఆడియెన్స్ ను ఆకట్టుకున్న కునాల్ కొహ్లి తెలుగు మార్కెట్ పై కన్నేశాడు. అందుకే సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమా చేస్తునాడు. ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా క్రేజీ ప్రాజెక్ట్ లను సొంతం చేసుకుంటున్నాడు సందీప్ కిషన్. మరి ఈ సినిమా అయినా సందీప్ ఆకలి తీర్చే హిట్ అందిస్తుందో లేదో చూడాలి.