మెగా హీరోయిన్ తో నారా హీరో.. వాట్ ఏ కాంబినేషన్ గురూ..!

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా పరిచయమైన నిహారిక తొలి చిత్రం ఒక మనసు అంతగా హిట్ అవ్వలేదు. స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చినా మంచి ఫీల్ గుడ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఆ సినిమా ఫలితం అంతగా సాటిస్ ఫై చేయకపోయినా సరే కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ తన సెకండ్ మూవీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే కోలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్న నిహారిక తెలుగులో కూడా మరో మూవీ షురూ చేస్తుందట.

నారా వారి ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చి డిఫరెంట్ కథతో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నారా రోహిత్ పవన్ సాదినేని డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడట. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో సావిత్రి సినిమా వచ్చింది. ఆ సినిమా అంతగా క్లిక్ అవకపోయినా ఈమధ్యనే పవన్ చెప్పిన కథకు రోహిత్ ఫిదా అయ్యాడట. అందుకే మళ్లీ కలిసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మెగా హీరోయిన్ నిహారికను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే డైరక్టర్ పవన్ సాదినేని నిహారికతో కథ చర్చలు జరిపారట. ఒకవేళ తను ఓకే అంటే మాత్రం రోహిత్, నిహారిక కాంబినేషన్ కొత్తగా ఉంటుందని చెప్పొచ్చు.