
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఎకౌంట్ తో కూడా చేసిన సంచలనాలు అన్ని ఇన్ని కావు.. తనకు నచ్చినా నచ్చుకున్నా ఏదైనా విషయం మీద తోచిన ట్వీట్స్ తో రచ్చ రచ్చ చేసిన వర్మ ఇప్పుడు ఆ ట్విట్టర్ పేజ్ నుండి క్విట్ అయ్యాడు. ఆర్జివి జూం ఇన్ అంటూ 2009లో మొదలైన రాం గోపాల్ వర్మ ట్విట్టర్ పేజ్ 27/05/2017 తో క్లోజ్ అయిపోయింది. ట్విట్టర్ కు గుడ్ బై చెప్పిన ఆర్జివి ఇక నుండి ఇన్స్ స్టాగ్రాం లో యాక్టివ్ గా ఉండాలని నిర్ణయించుకున్నాడట.
ఇక ఈ విషయం ఎనౌన్స్ చేస్తూ తన మార్క్ లాస్ట్ ట్వీట్ వేశాడు వర్మ. ట్వీట్ మరణానికి ముందు నా ఆఖరి ట్వీట్ ఇదే.. అలాగని తానేమి ప్రశాంతంగా ఉండనని తన పని తాను చూసుకుంటానని అన్నాడు వర్మ. ఇన్నాళ్లు తనని ఫాలో అయిన వారికి కృతజ్ఞతలు చెప్పనంటూ వర్మ ఫైనల్ గా తన ట్వీట్ పేజ్ డిలీట్ చేశాడు. సడెన్ గా వర్మ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఏమో కాని వర్మ ట్విట్టర్ నుండి క్విట్ అవడం కొందరి హీరోల అభిమానులకు మాత్రం హ్యాపీగా ఉంటుంది.