
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం విక్రం సిరికొండ దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు కనుక ఇది కూడా రవి తేజ స్టయిల్లో యాక్షన్ సినిమా అనే అర్ధం అవుతోంది. జూన్ 5 నుంచి 25 వరకు పాండిచ్చేరిలో జరుగబోయే షెడ్యూల్ లో కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ సినిమాలో రవి తేజాతో రాశి కన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్, తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ సినిమాను లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ కధ అందించగా డైలాగ్స్ శ్రీనివాస్ రెడ్డి వ్రాశారు. సంగీతం: ప్రీతమ్స్, స్క్రీన్ ప్లే: దీపక్ రాజ్, ఎడిటింగ్: గౌతం రాజు, కెమెరా: ఎం.సుకుమార్.