జూన్ 9న వస్తున్న బులెట్

యాక్షన్ హీరో గోపీ చంద్ ఎప్పుడో పూర్తి చేసిన ‘ఆక్సిజన్’ సినిమా ఇంకా విడుదల కాకపోయినా దాని తరువాత మొదలుపెట్టి పూర్తి చేసిన ఆరడగుల బులెట్ సినిమా రిలీజ్ కు సిద్దం అయిపోయింది. జూన్ 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు బి గోపాల్ ప్రకటించారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. మణిశర్మ దీనికి సంగీతం అందించారు. జయలలిత బాలాజీ రియల్ మీడియా బ్యానర్ లో తాండ్ర రమేష్ ఈ సినిమాను నిర్మించారు. గోపీ చంద్ నటించిన ఆక్సిజన్ కూడా జూలై నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రెండుగాక సంపంత్ నంది దర్శకత్వంలో గోపీ చంద్ గౌతం నంద అనే మరో సినిమా చేస్తున్నాడు. అది కూడా ఈ ఏడాదిలోనే విడుదల కాబోతోంది.