
నాగ చైతన్య-సమంతాల పెళ్ళి ముహూర్తం ఖరారైంది. ఈ విషయం నాగ చైతన్య స్వయంగా తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో తమ పెళ్ళి జరుగుతుందని చెప్పారు. అంతకంటే ఎక్కువ వివరాలు చెప్పడానికి ఇష్టపడలేదు. వారి వివాహం గోవాలో, రిసెప్షన్ హైదరాబాద్ లో, హనీమూన్ న్యూ యార్క్ లో జరుగబోతున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ లో పెళ్ళి ఖాయం అయిపోయింది కనుక ఈలోగా ఇద్దరూ తాము ఒప్పుకొన్న సినిమాలన్నీ పూర్తి చేసుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పెళ్లికాగానే నెలరోజులు సినిమా షూటింగులకు గుడ్ బై చెప్పేసి ఇద్దరూ హనీమూన్ కోసం న్యూ యార్క్ వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం చైతు కంటే సమంతా ఎక్కువ సినిమాలలో చేస్తోంది. ఆమె రామ్ చరణ్ తేజ్ తో ఒక సినిమా, కాబోయే మావగారు నాగార్జున నటిస్తున్న రాజుగారి గది-2 సినిమాలో, మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించబడుతున్న మహానటి సావిత్రి సినిమాలోను నటిస్తోంది. ఇవి కాక కొన్ని తమిళ సినిమాలు కూడా చేస్తోంది.