
సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 130 కోట్ల దాకా ఉంటుందని టాక్. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ అంచనాలను పెంచేయగా టీజర్ త్వరలో రాబోతుందని తెలుస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా మే 31న స్పైడర్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారట.
రిలీజ్ అవబోతున్న టీజర్ 59 సెకన్లు ఉండబోతుందట. మహేష్ స్టైలిష్ లుక్ లో కనిపించబోతుండగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీగా ఉండనున్నాయట. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి టీజర్ తో మహేష్ ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తాడో చూడాలి.