
నందమూరి బాలకృష్ణ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. సినిమా టైటిల్ గా ఉస్తాద్ అంటూ ప్రచారం జరుగుతుంది. శ్రీయా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో స్పెషల్ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ స్పెషల్ ఐటం కోసం మొన్నామధ్య సన్ని లియోన్ ను దించుతున్నారని వార్తలు రాగా ఇప్పుడు ఆ పాటలో సన్ని కాదు ఛార్మి చిందులేస్తుందని అంటున్నారు.
శాతకర్ణి తర్వాత బాలయ్య నటిస్తున్న ఈ క్రేజీ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. రీసెంట్ గా సినిమాలో బాలయ్య లుక్ లీక్ అవగా వాటిని చూసి నందమూరి ఫ్యాన్స్ తెగ ఉత్సాహంలో ఉన్నారు. ప్రస్తుతం వరుస ఫ్లాపులను తీస్తున్న పూరి బాలయ్యతో హిట్ కొట్టడం గ్యారెంటీ అన్నట్టు పరిశ్రమ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సెప్టెంబర్ 29న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.