
కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ హిట్ కోసం కష్టాలు పడుతున్నాడు. లాస్ట్ ఇయర్ జక్కన్న యావరేజ్ గా నిలవగా.. ఈడు గోల్డ్ ఎహే డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం సునీల్ క్రాంతి మాధవ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఉంగరాల రాంబాబు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా మంచి మౌత్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు.
ఓ పక్క ఫ్లాపుల్లో ఉన్న సునీల్.. క్రేజ్ లేని దర్శకుడు ఈ కాంబినేషన్ లో వస్తున్న ఉంగరాల రాంబాబు మూవీ బిజినెస్ ఏమాత్రం కాలేదట. నిర్మాత పరుచూరి ప్రసాద్ మాత్రం సినిమా బిజినెస్ చేస్తేనే రిలీజ్ అంటూ ఖరాకండిగా చెప్పేశాడట. సినిమా బాగానే వచ్చిందన్న టాక్ ఉన్నా సునీల్ ఉంగరాల రాంబాబు రిలీజ్ కష్టాలు మాత్రం పడక తప్పట్లేదని ఫిల్మ్ నగర్ టాక్.