'భరత్ అను నేను'కి బ్యాడ్ సెంటిమెంట్..!

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ స్పైడర్ మూవీ పూర్తి కాకముందే శ్రీమంతుడు కాంబినేషన్ లో మరో మూవీ షురూ చేశాడు. కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు భరత్ అను నేను టైటిల్ ప్రచారంలో ఉంది. సినిమా సగానికి పైగా లండన్ లోనే ఉంటుందట. మహేష్ ఎన్నారైగా నటిస్తాడని టాక్. అందుకే సినిమా సెకండ్ షెడ్యూల్ లండన్ లో పెట్టుకుంటున్నారట.

మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమా కూడా ఎక్కువ భాగం లండన్ లోనే షూటింగ్ జరుపుకుంది. ఆ సినిమా ఫెయిల్యూర్ కాబట్టి లండన్ లో మహేష్ షూట్ అంటే ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది. అయితే ఇవేవి ఆలోచించకుండా జూన్ సెకండ్ వీక్ లో భరత్ అను నేను సినిమా షెడ్యూల్ కు రెడీ అవుతున్నాడు మహేష్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను డివివ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో దానయ్య డివివి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వాని మహేష్ తో జతకట్టే అవకాశాలున్నాయట.