
వెస్ట్రెన్ కల్చర్ అలవరచుకుంటున్న సౌత్ సినిమాల్లో ఇది అది కాకుండా అన్నిటిలో వారికి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక సినిమాల్లో అయితే అవసరం ఉన్నా లేకున్నా ఐటం సాంగ్స్, ఇంకా శృతిమించిన శృంగార సన్నివేశాలు ఉంచుతున్నారు. అయితే ఇలాంటి వాటికి నా సినిమాలో మాత్రం ఛాన్స్ లేదు అంటున్నాడు హీరో శిబి రాజ్. తెలుగు తమిళ పరిశ్రమలో సుపరిచితుడైన సత్యరాజ్ తనయుడైన శిబిరాజ్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. సక్సెస్ రేటు తక్కువ ఉన్నా సరే దాని కోసం తాను అడ్డదార్లు తొక్కనని అంటున్నాడు ఈ హీరో.
తెలుగులో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన క్షణం తమిళ రీమేక్ లో నటిస్తున్న శిబిరాజ్ అక్కడ సినిమాలో దర్శకుడు లిప్ లాకులు పెడదామనుకుంటున్నా తాను మాత్రం నో చెప్పేశాడట. హీరోయిన్ కూడా అదరచుంభనాలకు తనకు నో అబ్జెక్షన్ అని చెప్పినా తాను మాత్రం అబ్బే అలాంటివేమి వద్దు అంటున్నాడట. తన సినిమాలు తన కూతురితో కలిసి చూసేలా ఉండాలని లిప్ లాక్స్ ఉంటే కూతురి ముందు తనకు చిన్నతనంగా ఉంటుందని అంటున్నాడు శిబిరాజ్. మరి అందరు హీరోలు ఇలా ఆలోచిస్తే మంచిదే.. అయితే కమర్షియాలిటీ అంటూ ఓ రేంజ్ లో లిప్ లాక్స్ లాగిస్తున్న హీరోలకు శిబిరాజ్ చేసిన వ్యాఖ్యలు కాస్త షాక్ ఇచ్చాయనే చెప్పాలి.