మహాభారత టైటిల్ పై వివాదం..!

మాలీవుడ్ లో మోహన్ లాల్ లీడ్ రోల్ లో 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్న సినిమా మహాభారత. జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత వాసుదేవ నాయర్ రచించిన రండమూజం నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. రండమూజం భీముడి కోణంలో రాసిన నవల మరి ఆ కథకు మహాభారత టైటిల్ ఎలా పెడతారని కేరళ హిందూ ఐక్య వేదిక సంఘం వివాదం రేపింది.

నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఆ నవల పేరునే సినిమా టైటిల్ గా పెట్టాలని అంటున్నారు. కాదు కూడదని సినిమా టైటిల్ మహాభారత అని పెడితే కచ్చితంగా అల్లర్లు చేస్తామని.. సినిమా రిలీజ్ కానివ్వమని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం స్టార్ కాస్ట్ సెలక్షన్స్ లో ఉన్న ఈ సినిమాకు పెద్ద షాకే తగిలిందని చెప్పాలి. బి.ఆర్.శెట్టి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ విషయం పై జరుగుతున్న గొడవ ఎలా సర్ధుమనుగుతుందో చూడాలి.