
బాహుబలి లాంటి సినిమాకు రచయితగా పనిచేసిన విజయేంద్ర ప్రసాద్ తానే దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా శ్రీవల్లి. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమా మీద ఎలాంటి హైప్ క్రియేట్ అవలేదు. బాహుబలి తర్వాత అయినా కూడా దీన్ని పట్టించుకునే నాధుడే లేడు అందుకే రాజమౌళి క్రేజ్ ను ఈ సినిమాకు వాడాలని చూస్తున్నాడు రచయిత దర్శకుడు విజయేంద్ర ప్రసాద్.
తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న శ్రీవల్లి ఓ ప్రయోగాత్మక సినిమా. చెడు ఆలోచనలు రాకుండా మనసుని నియంత్రించే కథతో ఈ సినిమా తెరకెక్కింది. విజయేంద్ర ప్రసాద్ ఎంతో కష్టపడి ఇష్టపడి తీసిన ఈ సినిమాకు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇస్తున్నారట. సినిమా బిగినింగ్ లోనే కాదు ఇంపార్టెంట్ సీన్స్ లో కూడా జక్కన్న వాయిస్ వస్తుందట. ఈ రకంగా రాజమౌళి క్రేజ్ ను శ్రీవల్లికి వాడుకోవాలని చూస్తున్నాడు విజయేంద్ర ప్రసాద్. ఇప్పటికే శ్రీకృష్ణ 2006, రాజన్న సినిమాలకు దర్శకత్వం వహించినా సక్సెస్ అందుకోని విజయేంద్ర ప్రసాద్ ఈసారి మాత్రం సక్సెస్ కొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.