అప్పుడు కబాలి ఇప్పుడు 'కాలా'..!

సూపర్ స్టార్ రజినికాంత్ కబాలి డైరక్టర్ పా.రంజిత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. కబాలితో భారీ అంచనాలను క్రియేట్ చేసిన రంజిత్ వాటిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇక మరోసారి రజినితో అంచనాలకు తగ్గ హిట్ కొట్టేందుకు చూస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ గా 'కాలా' అని నిర్ణయించారు.

సౌత్ లో రజినికాంత్ మార్కెట్ గురించి తెలిసిందే అందుకే కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 'కాలా' హిందిలో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలున్నయట. సినిమాకు మరో విశేషం ఏంటంటే రజిని అల్లుడు ధనుష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కబాలి టీంతో చేస్తున్న ఈ కాలా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మాఫియా డాన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో రజిని త్వరలో జాయిన్ అవనున్నాడు.