
అక్కినేని అఖిల్ మొదటి సినిమా అఖిల్ భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ గా మిగిలింది. అందుకే సెకండ్ మూవీ కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు అఖిల్. విక్రం కుమార్ డైరక్షన్ లో అఖిల్ సెకండ్ మూవీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారట. దీనికి కారణం హీరోయిన్ దొరకకపోవడమే అని తెలుస్తుంది.
మొదట ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ ను సెలెక్ట్ చేయగా సినిమా లేట్ అవుతున్న కారణంతో అమ్మడు దీన్ని వదిలేసి వేరే సినిమాలు కమిట్ అయ్యింది. ఇక బాలీవుడ్ భామ అలియా భట్ ను తీసుకుందామంటే పారితోషికం భారీ రేంజ్ లో డిమాండ్ చేసిందని కాదన్నారట. అందుకే కాస్త షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారు చిత్రయూనిట్. నాగార్జున చెప్పడం అయితే నలుగురు అమ్మయిలను ఫైనల్ చేశామని వారిలో ఒకరని సెలెక్ట్ చేయడమే అని అంటున్నాడు. మరి ఫైనల్ గా అఖిల్ పక్కన ఆ లక్కీ ఆ ఛాన్స్ ఎవరు అందుకుంటారో చూడాలి.