తమిళంలోకి బాలకృష్ణ శాతకర్ణి..!

నందమూరి బాలకృష్ణ వందవ సినిమాగా ప్రతిష్టాత్మకంగా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. బాలయ్య నటన ప్రతిభను మరోసారి బయటపెట్టిన శాతకర్ణి మూవీ సక్సెస్ తో కెరియర్ లో మంచి జోష్ ఏర్పరచుకున్నాడు బాలకృష్ణ. క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు కోలీవుడ్ లో రిలీజ్ చేయనున్నారట.    

దాదాపు 250 స్క్రీన్స్ లో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తమిళంలో రిలీజ్ చేస్తున్నారట. సినిమాలో హీరోయిన్ శ్రీయ అక్కడివారికి సుపరిచితురాలే కాబట్టి ఆమె కూడా సినిమా సక్సెస్ కు కారణమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే అక్కడ రిలీజ్ చేస్తారట. తమిళంలో కూడా ఈ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి టైటిల్ తోనే రిలీజ్ అవుతుండటం విశేషం.  ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు పూరి జగన్నాద్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.