అందరికి నచ్చే పాట.. అడిగా అడిగా..!

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా నిన్ను కోరి. నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి కూడా స్పెషల్ రోల్ చేస్తున్నారు. జూన్ 23న రిలీజ్ అవబోతున్న ఈ సినిమాలో అడిగా అడిగా సాంగ్ ఈ నెల 27న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ సాంగ్ గురించి నాని ఓ స్పెషల్ వీడియో మెసేజ్ ఇచ్చాడు. ప్రేమలో పడే వారికి, ప్రేమలో ఉన్న వారికి, ప్రేమలో పడి బయటపడ్డ వారికి అందరికి ఈ పాట బాగా కనెక్ట్ అవుతుందని అన్నారు. 

తన కెరియర్ లో ఈ పాట చాల స్పెషల్ అని చెబుతూ ఆ సాంగ్ గురించి ఊరిస్తున్నాడు నాని. రీసెంట్ గా నేను లోకల్ తో హిట్ అందుకున్న నాని ఓ సాంగ్ గురించి ఈ రేంజ్ లో పొగడటం కాస్త కొత్తగా ఉన్న నాని మనసు గెలిచిన ఆ సాంగ్ ఏంటా అని ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ సాంగ్ టీజర్ రిలీజ్ చేసి అంచనాలను మరింత పెంచాడు నాని. నిన్ను కోరి సినిమాలో ప్రమోషనల్ సాంగ్ గా వస్తున్న అడిగా అడిగా సాంగ్ మే 27న రిలీజ్ చేస్తారట.