పొలిటికల్ థ్రిల్లర్ లో ఎన్టీఆర్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న జై లవకుశ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా పూర్తి కాకముందే తన తర్వాత సినిమా కొరటాల శివతో ఫిక్స్ చేశాడు తారక్. ఈమధ్యనే ఆ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఇక ఆ తర్వాత సినిమా కూడా లైన్ లో పెట్టాడట తారక్. ఎన్నాళ్ల నుండో అనుకుంటున్న త్రివిక్రం కాంబినేషన్ లో సినిమా కూడా సిద్ధం చేస్తున్నాడట.

ఆ కథ ఇప్పటివరకు జూనియర్ టచ్ చేయని సబ్జెక్ట్ అని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం త్రివిక్రం తారక్ కోసం ఓ పొలిటికల్ థ్రిల్లర్ కథ రాసుకున్నాడట. 2019 ఎలక్షన్స్ టార్గెట్ తో ఆ సినిమా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ తో సినిమా చేస్తున్న త్రివిక్రం ఆ సినిమా పూర్తి కాగానే తారక్ సినిమా స్క్రిప్ట్ మీద కూర్చోనున్నాడట. మరి తారక్ లాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో పొలిటికల్ థ్రిల్లర్ కథతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూడాలి.