చిరు ఉయ్యాలవాడలో సల్మాన్ ఖాన్..!

మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అఫిషియల్ గా ఎనౌన్స్ చేయకపోయినా ఆ సినిమాకు సంబందించిన అన్ని పనులను చక చకా చేయిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు తమిళ హింది భాషల్లో తెరకెక్కించాలని చూస్తున్నారు.  

రాం చరణ్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా నటించే అవకాశాలు ఉన్నాయట. బాలీవుడ్ లో ఈ సినిమా క్రేజ్ సంపాదించే ఉద్దేశంతో సల్మాన్ ను ఉయ్యాలవాడలో భాగమయ్యేలా చూస్తున్నారట. అంతేకాదు తమిళ పరిశ్రమకు సంబందించి కూడా ఓ క్రేజీ స్టార్ ఈ సినిమాలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఉయ్యాలవాడని కూడా బాహుబలి స్థాయిలో నిలబెట్టాలని చిత్రయూనిట్ తెగ ప్రయత్నాలు చేస్తుంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామనే దించుతారట.