మహేష్ తో బన్ని ఫైట్..!

సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం స్పైడర్ గా మహేష్, డిజెగా అల్లు అర్జున్ వస్తుండగా ఆ తర్వాత ఈ ఇద్దరు నటించే సినిమాలు త్వరలో స్టార్ట్ అవుతున్నాయి. మహేష్ కొరటాల శివతో భరత్ అను నేను చేస్తున్నాడు. అల్లు అర్జున్ వక్కంతం వంశీతో నా పేరు సూర్య మూవీ చేస్తున్నాడు. 

ఈ రెండు సినిమాలు 2018 సంక్రాంతి టార్గెట్ తో వస్తుండటం విశేషం. లాస్ట్ ఇయర్ సమ్మర్ లో కూడా మహేష్ బ్రహ్మోత్సవం, అల్లు అర్జున్ సరైనోడు రెండు దగ్గర డేట్స్ లోనే రిలీజ్ అయ్యాయి. కాని ఆ ఫైట్ లో స్టైలిష్ స్టార్ విజయం సాధించాడు. అయితే ఈసారి మాత్రం ఇద్దరు ఒకేసారి తమ సినిమాలు రిలీజ్ చేస్తుండటం విశేషం. మహేష్ బొమ్మ హిట్ అయితే ఆ కలక్షన్స్ రేంజ్ ఏంటో తెలిసిందే. ఇక మెగా హీరోల్లో వరుస విజయాల్లో ఫాంలో ఉన్న బన్ని సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుంది. మరి ఈ ఫైట్ రిజల్ట్ ఎలా ఉంటాయో అని ఇద్దరి హీరోల ఫ్యాన్స్ తెగ ఉత్సాహంతో ఉన్నారు.