1000 కోట్ల మహాభారతంలో నాగార్జున..!

భారతీయ సినిమా చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో వెయ్యి కోట్ల బడ్జెట్ మూవీ తెరకెక్కుతుంది. మహాభారత కథతో వస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్ లీడ్ రోల్ చేస్తున్నారు. పేరుకి మళయాల సినిమానే అయినా అందులో అన్ని సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటిస్తారని తెలుస్తుంది.

తెలుగు పరిశ్రమ విషయానికొస్తే మహాభారతంలో కర్ణుడి పాత్రకు తనని అడిగారని చెప్పాడు నాగార్జున. తన పాత్ర మొత్తం వివరించారని బాగా వచ్చిందని అన్నారు. అన్ని పనులను ముగించుకుని తన దగ్గరకు రావాలని వారికి సలహా ఇచ్చాడట నాగార్జున. చూస్తుంటే మహాభారతంలో నాగ్ కన్ఫాం అయినట్టే అంటున్నారు. ప్రయోగాలకు పెద్ద పీఠ వేసే నాగార్జున ఏరికోరి ఓ పాత్ర తన దగ్గరకు వస్తే తప్పకుండా చేస్తారు. సో ఈ లెక్కన చూస్తే ఆ సినిమాలో నాగ్ పాత్ర కన్ఫాం అన్నట్టే మరి.